శ్రీపాదరావుకు ఘనంగా నివాళి

గోదావరిఖని, వెలుగు : బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి శ్రీపాదరావు అని, ఆయన ఆశయ సాధనతో పాలన సాగిస్తామని చెన్నూరు​ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షుడు బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మక్కాన్‌‌‌‌ సింగ్‌‌‌‌ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

వివేక్ మాట్లాడుతూ.. గత పదేండ్లుగా అధికారంలో ఉండి కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన మాజీ మంత్రి, ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌ను కార్మికులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో ప్రజలు, కార్మికులు అష్టకష్టాలు పడ్డారని తెలిపారు. అనంతరం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఆ తర్వాత యైటింక్లయిన్ కాలనీలో కార్పొరేటర్ బదావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ..ఉమ్మడి ఏపీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశయ సాధనతో ముందుకు సాగుతానని తెలిపారు. సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ వరకు ఎదిగిన శ్రీపాదరావు జీవితం ఆదర్శనీయమన్నారు. కాకా వెంకట స్వామి నాలుగు సార్లు పెద్దపల్లి ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో ఆ పార్టీ లీడర్లు భూ కబ్జాలు, దందాలు, దాడులకు పాల్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.