బెంగాల్ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి: ఏపీ పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్

హైదరాబాద్, వెలుగు: బెంగాల్​లో జరిగిన జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసును నార్మల్​గా ట్రీట్​ చేస్తున్నారని ఏపీ పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. హైదరాబాద్​లోని గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్న తీరును చూస్తే బాధేస్తోందన్నారు. బాధ్యులను వెంటనే శిక్షించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని, ఇలాంటి వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపేక్షించొద్దని కోరారు. ఇలాంటి ఘటనలు ఇకముందు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తేవాలన్నారు. మహిళా డాక్టర్లకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.