ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ప్రధాన అనుచరులు, ఇతర లీడర్లు మంగళవారం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మోత్కురి లింగా గౌడ్, బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ ములకిడి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్మానాల మోహన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీ లో చేరారు.