- ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ నియోజకర్గంలోని మచ్చర్ల, ఫతేపూర్, సుర్బిర్యాల్, చేపూర్ లిఫ్ట్‌లను బీఆర్ఎస్ హయాంలో తాను మంజూరు చేయిస్తే ఇప్పడు కాంగ్రెస్ నాయకులు తామే మంజూరు చేయించామని చెప్పుకోవడం తగదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం మచ్చర్ల లిఫ్ట్ పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. తన హయాంలో లిఫ్ట్ మంజూరైందనే అక్కసుతో మచ్చర్ల లిఫ్ట్ పనులను చేపట్టడం లేదన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ పాలిట దుష్టశక్తులుగా మారాయని మండిపడ్డారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే తెచ్చిన నిధులు ఏమీలేవని, ఓడిన కాంగ్రెస్ నేత అవినీతిపరుడని, ఈ రెండు పార్టీల పుణ్యమా అని ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లిఫ్టుల పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.