
రంగారెడ్డి మోకిలా పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మోకిలాలో 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో విచారణకు హాజరయ్యారు. గతంలో ల్యాండ్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో జీవన్‌రెడ్డిపై కేసు నమోదయిన సంగతి తెలిసిదే.. ముందస్తు బెయిల్‌తో పాటు అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జీవన్‌రెడ్డి. విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశాలివ్వడంతో మార్చి 28న మోకిలా పీఎస్‌లో పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు జీవన్ రెడ్డి.
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో, చేవెళ్ల మండలం ఎర్లపల్లిలో భూవివాదానికి సంబంధించి జీవన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై మోకిలా, చేవెళ్ల పోలీసు స్టేషన్‌లలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.. 170 ఎకరాల్లో 93 ఎకరాలను మాత్రమే విక్రయించగా మిగిలిన భూమి తమదేనంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారంటూ చైతన్య రిసార్ట్స్‌కు చెందిన సామ దామోదర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే పోలీసులు నమోదు చేసిన కేసుల్లో స్టే మంజూరు చేయాలని కోరుతూ జీవన్ రెడ్డి .. దాఖలు చేసిన పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. కేసుల దర్యాప్తుపై నిలిపివేత ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో మోకిల పోలీసులు జీవన్ రెడ్డికి పోలీసులు నోటీసులివ్వగా ఇవాళ హాజరయ్యారు.