ఆర్మీ మాజీ చీఫ్‌ పద్మనాభన్‌ కన్నుమూత : 43 ఏళ్లపాటు మిలటరీలో సేవలు

ఆర్మీ మాజీ చీఫ్‌ పద్మనాభన్‌ కన్నుమూత : 43 ఏళ్లపాటు మిలటరీలో సేవలు

చెన్నై: ఇండియన్‌ ఆర్మీ మాజీ చీఫ్ సుందరరాజన్‌ పద్మనాభన్ (83) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఇవాళ మార్నింగ్​ చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పద్మనాభన్‌ 2000– 02 వరకు రెండేళ్లపాటు ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు.

2002 డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేశారు. అంతకుముందు ఆయన సౌతర్న్‌ కమాండ్‌లో జనరల్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. మొత్తానికి 1960 నుంచి 2002 వరకు ఆయన 43 ఏళ్లపాటు మిలటరీకి సేవలు అందించారు. పద్మనాభన్ 1940 డిసెంబర్‌ 5న కేరళ రాజధాని తిరువనంతపురంలో జన్మించారు.