కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ (84) కన్నుమూశారు. కోవిడ్ తర్వాత అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న ఆస్పత్రిలో చేరిన గొగోయ్ సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు రాష్ట్రా ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వ శర్మ. గొగోయ్ శరీరంలో పలు అవయవాల పనితీరు క్షీణించడంతో వెంటిలేటర్ సపోర్టుపై ఉన్న సంగతి తెలిసిందే.
ఆగస్టులో గొగోయ్ కరోనా బారిన పడటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించి.. ప్లాస్మా థెరిపీ ట్రీట్ మెంట్ చేశారు. కరోనా నుంచి కోలుకున్న కొద్ది రోజుల తర్వాత ఆయన మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నవంబర్ 2 నుంచి ఆయన గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో వెంటిలేటర్ సపోర్టు మీదనే ఉన్నారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడటమే కాక, శరీరంలో కీలక అవయవ వ్యవస్థలు దెబ్బతినడంతో మృతి చెందారని తెలిపారు డాక్టర్లు.