హోబర్ట్ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. షెఫీల్డ్ షీల్డ్‌లో టాస్మానియా తరఫున క్వీన్స్‌లాండ్‌పై శుక్రవారం తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన పైన్ ఆటనుంచి వైదొలుగుతున్నట్టు తెలిపాడు. వికెట్ కీపర్ అయిన పైన్ 2018–2021 మధ్య 35 టెస్టులు ఆడి 23 టెస్టుల్లో ఆసీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పైన్ టీమ్‌ను నడిపించాడు. అయితే, క్రికెట్ టాస్మానియా మాజీ ఉద్యోగికి లైంగిక సందేశాలు పంపించినట్టు తేలడంతో పైన్ 2021 చివర్లో కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత టీమ్‌కూ దూరమయ్యాడు.