న్యూఢిల్లీ: హిందూ సంస్థ ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్‌పై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గురువారం స్పందించారు. చిన్మయ్ కృష్ణను వెంటనే రిలీజ్ చేయాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి సూచించారు. "చిన్మయ్ కృష్ణ దాస్ ను అన్యాయంగా అరెస్టు చేశారు. చిట్టగాంగ్‌లో ఆలయాన్ని తగులబెట్టారు. గతంలోనూ మసీదులు, పుణ్యక్షేత్రాలు, చర్చిలు, మఠాలు, అహ్మదీయుల ఇండ్లపై దాడులు చేశారు. దోచుకుని ధ్వంసం చేశారు. దేశ ప్రజలకు మత స్వేచ్ఛతో పాటు వారి ఆస్తులకు భద్రత కల్పించడం చాలా ముఖ్యం. చిట్టగాంగ్‌లో న్యాయవాది హత్య బాధాకరం. దోషులను కచ్చితంగా శిక్షించాలి" అని షేక్ హసీనా పేర్కొన్నారు.