బంగ్లాదేశ్‎కు తిరిగొస్తా.. అందుకే అల్లాహ్ నన్ను బతికించాడు: షేక్ హసీనా

బంగ్లాదేశ్‎కు తిరిగొస్తా.. అందుకే అల్లాహ్ నన్ను బతికించాడు: షేక్ హసీనా

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా మళ్లీ స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అందుకే అల్లాహ్ తనను బతికించాడని అన్నారు. మంగళవారం పార్టీ కార్యకర్తలతో సోషల్ మీడియాలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మహమ్మద్‌ యూనస్‎పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఆయనకు ప్రజలపై ప్రేమ లేదు. అప్పట్లో ఆయన తీరును అర్థం చేసుకోలేకపోయాం. అందుకే అప్పట్లో మేం అతడికి సహాయం చేశాం. కానీ, ప్రజలు మాత్రం లబ్ధి పొందలేదు. ఆయన అధికార దాహం ఇప్పుడు బంగ్లాదేశ్‎ను కాల్చేస్తోంది” అని పేర్కొన్నారు.