కాంగ్రెస్‌‌ గెలిస్తే కొత్తకొండను మండలం చేస్తాం : ఎంపీ పొన్నం ప్రభాకర్‌‌

భీమదేవరపల్లి, వెలుగు : కాంగ్రెస్‌‌ అధికారంలోకి రాగానే కొత్తకొండను మండలం చేస్తామని హుస్నాబాద్‌‌ కాంగ్రెస్‌‌ క్యాండిడేట్‌‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌‌ హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ, మల్లారం, రసులపల్లి, ధర్మారం గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశానని, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిపై ఎమ్మెల్యే సతీశ్‌‌ బహిరంగ చర్చకు రావాలని సవాల్‌‌ చేశారు. అనంతరం కొత్తకొండ సర్పంచ్‌‌ దూడల ప్రమీల, ఉపసర్పంచ్‌‌ సిద్ధమల్ల కృష్ణ పొన్నం సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు.