బ్రాహ్మణ పరిషత్కు నిధులు రిలీజ్ చేయాలి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

బ్రాహ్మణ పరిషత్కు నిధులు రిలీజ్ చేయాలి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
  • బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 

హైదరాబాద్, వెలుగు: బ్రాహ్మణులతో వివాదం పెట్టుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్ వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. బ్రాహ్మణ పరిషత్ కు వెంటనే నిధులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. 

రానున్న అసెంబ్లీ సమావేశాల్లో పరిషత్ కు నిధుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకపోతే 15 రోజుల్లో బీజేపీ నేతృత్వంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు గోపూజ చేసిన తర్వాత ఎన్నికల ప్రచారం చేసేవారన్నారు. 

సీఎం పీఠం అధిరోహించేందుకు కూడా ముహుర్తాలు పెట్టించుకున్నారని గుర్తుచేశారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా విదేశీ విద్యకు అవకాశం కల్పించి మొదటి సెమిస్టర్ ఫీజు మాత్రమే చెల్లించారని, దీంతో విదేశాల్లోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.