
హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఆదివారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు. తన సన్నిహితులతో చర్చించి త్వరలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీగా పనిచేసిన మోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చాలా కాలం పనిచేశారు.
26 ఏండ్ల పాటు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. టీచర్ల సమస్యలపై సీఎంలతో చర్చించి పరిష్కరించారు. 2018 ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఆ టైమ్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్.. మోహన్ రెడ్డిని పార్టీ రిటైర్డ్ టీచర్స్ ఎంప్లాయీస్ సెల్ స్టేట్ కన్వీనర్‌గా నియమించారు.