- బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25నాటికి 25 లక్షల సభ్యత్వం చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తెలిపారు. ఈ నెల 11 నుంచి రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందని, ఈ నెల 18 వరకూ 6 లక్షల సభ్యత్వాలు అయ్యాయని ఆయన చెప్పారు. ప్రతి బూత్ కు 200 సభ్యత్వం చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 2 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, ఇప్పటి వరకూ 4.2 కోట్ల సభ్యత్వం పూర్తయిందన్నారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణను ఎంఐఎం నేతలు వ్యతిరేకించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వక్ఫ్ బోర్డులో మహిళలు లేరని, ముస్లింలోని పలు తెగలకు చెందిన వారికి అక్కడ ప్రాతినిధ్యం లేదన్నారు. అవినీతిని ప్రోత్సహించే వ్యక్తులే సవరణను వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు.