ఆమె అందమైన మాజీ హీరోయిన్.. అప్పట్లో హిందీ సినిమాల్లో ఓ వెలుగు వెలిగింది. కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. ఆమె మమతా కులకర్ణి. ఆమె అందానికి అప్పటి వాళ్లు మమైరిచిపోయేవారు. అంతటి అందం మమతా కులకర్ణిది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ సినిమాల్లోనూ నటించి.. తెలుగు సినీ అభిమానులకు దగ్గర అయ్యింది. అలాంటి మాజీ అందమైన హీరోయిన్ మమతా కులకర్ణి సన్యాసం తీసుకున్నది. అలహాబాద్‌లో జరుగుతున్న కుంభమేళాలో సన్యాసం తీసుకుని.. మిగతా శేష జీవితాన్ని దేవుడికి అర్పిస్తుంది మమతా కులకర్ణి. 52 ఏళ్ల మమతా కులకర్ణి సన్యాసం స్వీకరణ అనేది అందర్నీ షాకింగ్‌కు గురిచేసింది.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మమతా కులకర్ణి సన్యాసం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్ రాజ్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోన్న మహా కుంభమేళా సాక్షిగా మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించి సాధ్విగా మారిపోయారు. 2025, జనవరి 24వ తేదీ ఉదయం మహాకుంభ్‌లోని కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి సమక్షంలో ఈ బాలీవుడ్ సీనియర్ సన్యాస దీక్ష తీసుకున్నారు.
పూర్తిగా కాషాయ దుస్తులు ధరించి.. మెడలో రుద్రాక్ష మాల, భుజానికి వేలాడుతున్న కుంకుమపువ్వుతో నిజమైన సాధ్విగా మారిపోయారు. సన్యాసం పుచ్చుకున్న తర్వాత మమతా కులకర్ణి పేరు కూడా మార్చుకున్నారు. ఆమె కొత్త పేరు మై మమతానంద్ గిరి సాధ్వి. మమతా కులకర్ణి సన్యాసం తీసుకున్న దృశ్యాలు, ఆ తర్వాత ఆమె పూర్తిగా సాధ్విగా మారిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తన అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారును ఊర్రూతలూగించిన మమతా కులకర్ణి ఒక్కసారిగా సన్యాసిగా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ షాక్‌కి గురి అవుతున్నారు. 52 ఏళ్ల వయస్సులో సన్యాసం పుచ్చుకున్న మమతా.. మిగతా శేష జీవితాన్ని దేవుడికి అర్పించింది. 90ల్లో బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన మమతా కులకర్ణి.. ఆ తర్వాత కూడా ఎన్నో కాంట్రార్సీల్లో ఇరుక్కుని తరుచూ వార్తల్లో నిలిచేవారు. ఇక, సన్యాసం స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘మహాకుంభ మేళాకు రావడం, దాని గొప్పతనాన్ని చూడటం నాకు మరపురాని క్షణం. మహాకుంభ మేళా సాక్షిగా సన్యాసం స్వీకరించడం నా అదృష్టం’’ అని పేర్కొన్నారు.