
బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ ఇంజనీర్ కు సోమవారం నాగ్‌పూర్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. పాకిస్థాన్ ISI తీవ్రవాద సంస్థకు నిశాంత్ అగర్వాల్ గూఢచర్యం చేశారని రుజువైంది. అతనిపై అధికారిక రహస్యాల చట్టం(OSA) 3,4 సెక్షన్లపై అభియోగాలు మోపారు. నిశాంత్ అగర్వాల్ కు రూ.3వేల ఫైన్ తోపాటు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
నిశాంత్ బ్రహ్మోస్ ఫెసిలిటీలో 4 సంవత్సరాలు పనిచేశాడు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది రష్యాకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్టియం మధ్య జాయింట్ వెంచర్. నాగ్‌పూర్‌లోని క్షిపణి కంపెనీ సెంటర్ లో టెక్నికల్ రిసెర్చ్ విభాగంలో పని చేస్తున్న అగర్వాల్‌ను 2018లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ లు జాయింట్ ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. సెన్సిటీవ్ డేటాను పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు లీక్ చేసునట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అగర్వాల్‌కు ఏప్రిల్‌లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది.