హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం (సెప్టెంబర్ 9) రాత్రి కన్నుమూశారు. లక్ష్మారెడ్డి స్వగ్రామమైన తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
Also Read :- పత్తి కొనుగోళ్లకు సిద్ధమవ్వండి
సీనియర్ నేత లక్ష్మారెడ్డి సతీమణి మరణం పట్ల పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ లక్ష్మారెడ్డి భార్య మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్వేత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, గతేడాది నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుండి బరిలోకి దిగిన లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.