BRS మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

BRS మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‎లోని భరణీ లే అవుట్‎లో ఉన్న జైపాల్ యాదవ్ నివాసంలో రూ.7.5 లక్షల నగదు దొంగలించారు.  ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించిన మాజీ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. 

జైపాల్ యాదవ్ ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నగరంలోని రిచెస్ట్ ఏరియాతో పాటు ఎక్కువగా సినీ, రాజకీయ ప్రముఖులు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోరీ జరగడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. జూబ్లీహిల్స్‎లో నిఘా పెంచారు. 

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో జైపాల్ పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జైపాల్ యాదవ్ తన ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయించాడని ఆరోపణలు వెల్లు వెత్తాయి. మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న ద్వారా తన ప్రత్యర్థుల ఫోన్లను జైపాల్ యాదవ్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు జైపాల్ యాదవ్‎కు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ జైపాల్ యాదవ్‎ను విచారించారు. తిరుపతన్నతో సంబంధాలు.. అతడికి పంపిన నెంబర్లు ఎవరివంటూ పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది.