బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ

బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కారు యాక్సిడెంట్ కేసులో సస్పెండ్ అయిన పంజాగుట్ట సీఐ దుర్గారావు హైకోర్టును ఆశ్రయించారు. అతడిని అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాలని దుర్గారావు కోర్టును కోరారు. ఈ కేసులో పోలీసులు దుర్గారావును ఏ11గా చేర్చారు. డిసెంబర్ 23, 2023న ప్రజాభవన్ వద్ద షకీల్ కొడుకు సాహిల్ కారు నడుపుతు బారీకెడ్ల పైకి దూసుకెళ్లింది.

 దీంతో పోలీసులు వెంటనే అతన్ని పట్టుకుని పంజాగుట్ట స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి అదే రాత్రి షకీల్ కొడుకు తప్పించుకున్నాడు. సీఐ సహకారంతోనే నిందితుడు తప్పించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ పంజాగుట్ట సీఐ దుర్గారావు ఫోన్ లో మాట్లాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వారి కాల్ రికార్డింగ్ తీసి బోధన్ సీఐను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు పోలీసులు అరెస్టు అయ్యారు.