![బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ల ఫైటింగ్!](https://static.v6velugu.com/uploads/2025/02/former-brs-sarpanchs-fighting-for-michine-kakateya-contract-work-bills_hkAmSYG6vD.jpg)
- మిషన్ కాకతీయ కాంట్రాక్ట్ పనులు బిల్లులపై విభేదాలు
- పార్టీ ఆఫీసులో నేతల ముందే పరస్పరం దాడి
- ఒకరికి తీవ్ర గాయాలు కాగా వరంగల్ ఆస్పత్రికి తరలింపు
- వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని బీఆర్ఎస్ ఆఫీసులో ఘటన
నల్లబెల్లి/నర్సంపేట, వెలుగు: మిషన్ కాకతీయ కాంట్రాక్టు లావాదేవీల్లో వచ్చిన విభేదాలతో బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు మాజీ సర్పంచ్‌లు కొట్టుకున్నారు. ఇందుకు ఆ పార్టీ ఆఫీసునే వేదికగా నిలిచిన ఘటన వరంగల్జిల్లా నల్లబెల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం నల్లబెల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ఆఫీసులో పార్టీ లీడర్లు దాదాపు 30 మంది ప్రెస్ మీట్పెట్టారు.
అనంతరం అదే మండలానికి చెందిన లెంకలపల్లి మాజీ సర్పంచ్గన్నెబోయిన చేరాలు, నల్లబెల్లి మాజీ సర్పంచ్కొత్తపల్లి కోటిలింగా చారి కలిసి దుగ్గొండి మండలానికి చెందిన కాంట్రాక్టర్పేరుపైన మిషన్‌కాకతీయ చెరువు పనులను తీసుకుని పూర్తి చేశారు. కాగా.. కాంట్రాక్టర్‌కు అప్పటి సర్కార్ బిల్లులు చెల్లించినట్లు తెలిసింది. కాంట్రాక్టర్వద్ద నుంచి తనకు డబ్బులు రాకుండా కోటి లింగాచారి అడ్డుపడుతున్నాడని చేరాలు, కాంట్రాక్టర్ తనకు డబ్బులు ఇవ్వలేదని కోటిలింగాచారి పార్టీ లీడర్లకు చెప్పకుంటుండగా.. గొడవ ముదిరి బుధవారం లీడర్ల ముందే ఇద్దరు మాజీ సర్పంచ్‌లు కొట్లాటకు దిగారు. దీంతో కోటిలింగాచారి తుంటికి తీవ్ర గాయం కాగా వెంటనే వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. చేరాలు చేతికి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలిసింది.