హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ చేయకుండా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. గతంలో ఒకే సమయంలో హెచ్‌సీఏ, డెక్కన్ బ్లూస్ క్లబ్ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్ పని చేశాడు.
దీంతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉండి నిబంధనలను ఉల్లంఘించినందుకు జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు హెచ్‌సీఏ ఓటర్ జాబితా నుంచి అజర్ పేరును తొలగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. గత నెల 30న హెచ్‌సీఏ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.