టీఆర్ఎస్ కు పడాల శ్రీనివాస్ రాజీనామా

అంతర్గత కుమ్ములాటలతో టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం  మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు, చౌటుప్పల్ మండల ఎంపీపీ వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా   ఆలేరు మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్  పడాల శ్రీనివాస్ టీఆర్ఎస్ కు  రాజీనామా చేశారు. ఆయనతో పాటు సుమారు 500 మంది ముఖ్య నాయకులు టీఆర్ఎస్ కు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

రాజీనామా చేసిన వారిలో పలు గ్రామాల అధ్యక్షులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ మాజీ పాలక వర్గం సభ్యులు ఉన్నారు.  దాదాపు 5 వేల మందితో పడాల శ్రీనివాస్  21న మునుగోడు బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.