ఆంధ్రప్రదేశ్‍‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‍‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: వైఎస్ జగన్

ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాన మంత్రి మోదీని కలుస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో జూలై 24న ధర్నా చేస్తామని వైసీపీ అధినేత తెలిపారు.  వినుకొండలో హత్యకు గురైన రహీద్ కుటుంబాన్ని  పరామర్శించిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజకీయ కక్ష్యతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు జగన్. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. 

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు జరిగాయని ఫైర్ అయ్యారు. వైకాపా నేతలు, కార్యకర్తలే టార్గెట్ గా చేసుకొని దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని వివరించారు జగన్. 300లకుపైగా హత్యాయత్నాలు జరిగాయి. 490 ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్థులపై, 560 చోట్లు ప్రైవేట్ ఆస్థులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. వైన్ షాప్ లో పని చేస్తున్న రషీద్ అనే యువకుడిని కత్తితో దాడి చేసి హత్య చేశారని ఆరోపించారు. వైసీపీ మద్దతుదారులపై దాడులు చేస్తున్నారని, అవి చూసి అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.