కర్నాటక హైకోర్టు తీర్పుపై కాశ్మీర్ మాజీ సీఎం అసంతృప్తి

ముస్లిం అమ్మాయిలు, మహిళలు ధరించే హిజాబ్ పై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. ఓ వైపు మహిళా సాధికారత,సంక్షేమం గురించి మాట్లాడుతూ మరోవైపు.. వాళ్లకు ఇష్టమైనవి ధరించడంపైనా ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు. అమ్మాయిలు, మహిళలు ఏం ధరించాలనే దానిపై కోర్టులు నిర్ణయాలు చెప్పడం సరికాదన్నారు. కర్నాటక ప్రభుత్వం విద్యా సంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై నిషేధం విధించగా.. హిజాబ్ ధరించడానికి అనుమతివ్వాలని కోరుతూ  ఉడిపి, కుందాపుర తదితర ప్రాంతాలకు చెందిన కొంత మంది విద్యార్థినులు హైకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించి ఫిబ్రవరి 25 తీర్పును రిజర్వు చేసి ఇవాళ తుది తీర్పు వెలువరించింది. 

 

ఇవి కూడా చదవండి

రేపట్నుంచి 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్

ఎన్టీఆర్ ఓ సూపర్ కంప్యూటర్.. చరణ్ నన్ను ఆశ్చర్యపరిచాడు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్