షేర్ల పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందని మాజీ CM వైఎస్ జగన్ రెడ్డి హైదారాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారు. పిటీషన్‌లో విజయమ్మ, షర్మిల, జనార్దన్ రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు జగన్. ఈ రోజు కంపెనీ లా ట్రిబ్యూనల్ ఆ పిటిషన్ ను విచారించింది. తనకు తెలియకుండా తల్లి విజయమ్మ, సోదరి షర్మిలా అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని వైస్ జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు.
ALSO READ : కచ్చితంగా న్యాయమే గెలుస్తుంది.. ప్రతి సైనికుడికి అండగా ఉంటా: వైఎస్ జగన్ ట్వీట్..
బదిలీ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు ఏమీ సమర్పించకుండానే వారి పేర్ల మీదకు షేర్లు మార్చుకున్నారన్న జగన్ ఆరోపించారు. అయితే ట్రిబ్యూనల్ లో కౌంటర్ దాఖలు చేయడానికి విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది సమయం కోరారు. ఎన్సీఎల్టీ డిసెంబర్ 13కి విచారణ వాయిదా వేసింది. జగన్, భారతీ, క్లాసిక్ రియాల్టీ పేర్ల మీద ఉన్న 51.01 శాతం షేర్లను యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ పేర్కొన్నారు.