-
గడచిన పదేళ్లూ ‘స్కామిలీ’ పాలన
-
టీ కాంగ్రెస్ సెటైరికల్ట్వీట్
హైదరాబాద్: మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై టీ కాంగ్రెస్ సెటైరికల్ట్వీట్చేసింది. జీఎస్టీ స్కాంలో ఆయనపై కేసు, వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో సీసీఎస్ లో నమోదు, ఎఫ్ఐఆర్ లో ఐదో నిందితుడిగా పేరు అంటూ వచ్చిన కథనాన్ని పోస్ట్ చేస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేసింది. ‘సోమేశ్ ఆ నాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనే కంటే.. కల్వకుంట్ల ఫ్యామిలీకి నమ్మిన బంటు అనడం కరెక్ట్. ప్రజాధనానికి కస్టోడియన్ గా ఉండాల్సిన ఈయన ప్రజాధనం దోపిడీకి మార్గదర్శిగా మారాడు. జీఎస్టీ వసూళ్లలో ఏకంగా రూ.1000 కోట్ల గోల్ మాల్ స్కాం తాజాగా బట్టబయలైంది. తెలంగాణలో గడచిన పదేళ్లూ ‘స్కామిలీ’ పాలన జరిగిందనడానికి ఇది మరో నిదర్శనం’ అని ఆరోపించింది.