హనుమకొండ సిటీ, వెలుగు : పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటానని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ చెప్పారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 2005లో టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ ఏ పని అప్పజెప్పినా బాధ్యతాయుతంగా పూర్తి చేశానన్నారు. వరంగల్ పశ్చిమలో గతంలో ఎవరూ చేయలేని అభివృద్ధి పనులను పూర్తి చేశానన్నారు.
రూ. వేల కోట్లతో హనుమకొండను ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సుందర్ రాజుయాదవ్, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్ధన్‌గౌడ్ పాల్గొన్నారు.