గుండెపోటుతో చైనా మాజీ ప్రధాని కన్నుమూత

చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా వెల్లడించింది.  ప్రస్తుతం షాంఘైలో నివసిస్తున్న ఆయనకు  అర్ధరాత్రి 12:10 గంటలకు గుండెపోటు రావడంతో  వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  లీ కెకియాంగ్  కన్నుమూశారు.  2013 నుంచి మార్చి 2023 వరకు ఆయన చైనా ప్రధానిగా ఉన్నారు. 

ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు కెకియాంగ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఈ ఏడాది ఆరంభంలో లీ కియాంగ్‌ను ప్రధాని ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. జీ జిన్‌పింగ్ గ్రూపుతో లీ సంబంధాలు బ‌ల‌హీన‌ప‌డ‌డం వ‌ల్లే ఆయ‌న్ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించారు.  చైనీస్   కమ్యూనిస్ట్ పార్టీలో  హు జింటావో తర్వాత లీ కెపియాంగ్  అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు.