గురువు గారూ బాగున్నారా..!

మిర్యాలగూడ, వెలుగు : తన ఆత్మీయ గురువు, మానవ హక్కుల సంఘం రాష్ట్ర నేత పొన్నూరు సుబ్బారావును మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి మిర్యాలగూడలోని శాంతి నగర్ లో బుధవారం కలిశారు.

aఅరగంటపాటు వారితో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా అక్షరం దిద్దిన జానారెడ్డి ఆ తర్వాత రాజకీయ నేతగా ఎదిగి14 శాఖలకు మంత్రిగా పనిచేశారు.