ఇందిరమ్మ లబ్ధిదారుల లోన్లను ప్రభుత్వమే చెల్లించింది : జైవీర్​రెడ్డి

ఇందిరమ్మ లబ్ధిదారుల లోన్లను ప్రభుత్వమే చెల్లించింది : జైవీర్​రెడ్డి
  • మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్​రెడ్డి

హాలియా, వెలుగు: గత కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో ఇందిరమ్మ పథకంలో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెందిన బ్యాంకు లోన్లను ప్రభుత్వమే చెల్లించిందని మాజీ సీఎల్పీ లీడర్​ కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్‌‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటి పరిధిలోని అనుముల గ్రామంలో 1,014 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రుణ విముక్తి కలిగించి ఇండ్ల హక్కు పత్రాలను అందజేశారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో ఇందిరమ్మ ఇండ్లతోపాటు వివిధ పథకాల్లో మంజూరైన ఇండ్ల రుణాలను బ్యాంకులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆరు నెలల కిందనే సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేసినప్పటికీ సమయాభావం కారణంగా పత్రాలను అందజేయడంలో ఆలస్యమైందన్నారు. ఇకనుంచి ఇందిరమ్మ ఇండ్ల హక్కు పత్రాలు నేరుగా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.  అనంతరం 48 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. 

రామాలయ ధ్వజస్తంభం ప్రతిష్టాపన పూజలు హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ధ్వజస్తంభం పున:ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ సీఎల్పీ లీడర్​ కుందూరు జానారెడ్డి సతీమణి సుమతమ్మ, ఎమ్మెల్యే జైవీర్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనుముల గ్రామం జానారెడ్డి సొంతూరు. ఈ సందర్భంగా తన చిన్నానాటి మిత్రుడు పెద్దకోటయ్యను కలిశారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ కర్నాటి లింగారెడ్డి, మార్కెట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, లీడర్లు నారాయణ గౌడ్, నరేందర్ రెడ్డి, చంద్రారెడ్డి, శ్రీనివాస్​, రాజారమేశ్‌, తహసీల్దార్ రఘు పాల్గొన్నారు.