ప్రజా బలంతోనే పదవులు : కుందూరు జానారెడ్డి

 ప్రజా బలంతోనే పదవులు : కుందూరు జానారెడ్డి
  • సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి
  • ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు స్వాగతం పలికిన కాంగ్రెస్​ శ్రేణులు 

మిర్యాలగూడ, వెలుగు: ప్రజాబలం, వారి ప్రజల పక్షాన చేసే పోరాటాలతోనే పదవులు దక్కుతాయని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మండల అధ్యక్ష స్థాయి నుంచి నేడు ఎమ్మెల్సీగా ఎన్నికైన కేతావత్ శంకర్ నాయక్ ప్రస్థానమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన శంకర్​నాయక్​కు శనివారం సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.  మాడుగులపల్లి నుంచి క్యాంప్ ఆఫీస్ వరకు విజయోత్సవ ర్యాలీ తీశారు. జానారెడ్డితోపాటు శంకర్​నాయక్, ఎంపీ రఘువీర్​రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలను గజమాలతో సత్కరించారు. 

ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ..  రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జానారెడ్డి సూచనల మేరకు పనిచేస్తూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో జానారెడ్డి తనకు మండల అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చి, ప్రోత్సహించారని తెలిపారు. తాను ఎమ్మెల్సీ పదవిని చేరేవరకు వెన్నంటి ఉండి, నడిపించారని భావోద్వేగానికి లోనయ్యారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.