కందుల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి : మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి

కందుల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి : మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి

హాలియా, వెలుగు : కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని మాజీ సీఎల్పీ లీడర్​ కుందూరు జానారెడ్డి సూచించారు. గురువారం హాలియా వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కందులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మార్కెట్ అభివృద్ధికి కృషి చేసిన చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డిని అభినందించారు. అనంతరం జానారెడ్డిని చైర్మన్ శాలువాలతో సన్మానించారు.

అంతకుముందు త్రిపురారం మండలం రాగడప గ్రామంలోని మారెమ్మ ఆలయాన్ని జానారెడ్డి సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట డీసీసీ కార్యదర్శి నారాయణగౌడ్, కాంగ్రెస్​మండల అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గౌనిరాజా రమేశ్ యాదవ్, నాయకులు తదితరులు ఉన్నారు.