ఆనాడైనా..ఈనాడైనా తెలంగాణకు నెంబర్వన్ విలన్ కాంగ్రెస్:బీఆర్ఎస్ సభలో కేసీఆర్

ఆనాడైనా..ఈనాడైనా తెలంగాణకు నెంబర్వన్ విలన్ కాంగ్రెస్:బీఆర్ఎస్ సభలో కేసీఆర్

ఆనాడైనా..ఈనాడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అన్నారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వరంగల్ జిల్లాలో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులు త్యాగం చేసినవాళ్లు బీఆర్ఎస్ బిడ్డలే..పదవులకోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్లు కాంగ్రెస్ నాయకులని అన్నారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ గడ్డపై ఉండి నిండు శాసనసభలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని, స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించారని అన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ శాసనసభలో తెలంగాణ అంటే అది నేరంగా పరిగణించారని కేసీఆర్ అన్నారు. 

హైదరాబాద్ స్టేట్ పేరుతో తెలంగాణను ఉన్న నాడు ప్రజల వద్దంటున్నా.. బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్ పార్టీ.. జవహర్ లాల్ నెహ్రూ అని విమర్శించారు కేసీఆర్. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వమన్నారు. 

2001లో మరోసారి తెలంగాణ ఉద్యమం ఉధృతం అయినప్పుడు తెలంగాణ ఇస్తమని నమ్మబలికి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఇయ్యకుండా పద్నాలుగేళ్లు ఏడిపించారని అన్నారు. 

►ALSO READ | తెలంగాణ కొత్త సీఎస్గా రామకృష్ణారావు.. భారీగా ఐఏఎస్ల బదిలీలు.. స్మితా సబర్వాల్కు ఏ పోస్ట్ అంటే..

కాంగ్రెస్ కుట్రలను ఛేదిస్తూ..జయశంకర్ సార్ తో కలిసి 36 పార్టీలను ఏకం చేశామన్నారు కేసీఆర్. దేశరాజకీయాలనుమార్చి కాంగ్రెస్ మెడలు వంచామన్నారు. అప్పటికీ దారికి రాకపోతే కేంద్ర మంత్రి పదవులను త్యాగం చేశామన్నారు. రాష్ట్రంలోని నేతలు కూడా పదవులు వదిలి  మళ్లీ ఉద్యమ జెండాలు పట్టామన్నారు. అప్పటికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోకపోతే.. ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను. ఆక్రమంలో భయపడ్డ కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చేందుకు ప్రకటన చేసిందన్నారు. 

తెలంగాణ ఇచ్చేందుకు మరోసారి కాంగ్రెస్ వెనకడుగు వేయడంతో సాగరహారాలు, వంటావార్పు, సకలజనుల సమ్మె ఉద్యమ కార్యక్రమాలతో అటు రాష్ట్ర, దేశ రాజకీయాలను హోరెత్తిండచంతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు కేసీఆర్.