తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారానికి ప్రాయశ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు వైసీపీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక పిలుపునిచ్చారు. చంద్రబాబు తప్పుడు ప్రచారానికి నిరసనగా సెప్టెంబరు 28 శనివారం రోజున ప్రతి ఒక్కరూ పూజల్లో పాల్గొనాలని సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా పిలుపునిచ్చారు.
‘‘తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను,
వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది’’ అని జగన్ ట్వీట్ చేశారు.
కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతు నూనె, పంది కొవ్వు వంటి నిషేదిత పదార్థాలు కలిశాయన్నారు. కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందన్న చంద్రబాబు కామెంట్స్ ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారి తీసింది.
ALSO READ | Jagan: తిరుమల లడ్డూపై నిజాలు తెలుసుకోండి.. దేశంలోని బీజేపీ సీఎంలకు జగన్ లేఖలు
అయితే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్, చంద్రబాబు ప్రభుత్వ 100 రోజుల పాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని వైసీపీ మండిపడుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య లడ్డూ లొల్లి పీక్స్‌లో ఉండగా.. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని జగన్ పిలుపునివ్వడంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
తిరుమల పవిత్రతను,
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2024
స్వామివారి ప్రసాదం విశిష్టతను,
వెంకటేశ్వరస్వామి వైభవాన్ని,
టీటీడీ పేరు ప్రఖ్యాతులను,
వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను,
రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య…