నేను కొడితే మాములుగా ఉండదు.. తెలంగాణ శక్తి ఏంటో చూపిస్తాం: కేసీఆర్

 నేను కొడితే మాములుగా ఉండదు.. తెలంగాణ శక్తి ఏంటో చూపిస్తాం: కేసీఆర్

హైదరాబాద్: చాలా కాలంగా ఫామ్ హౌస్‎లో సైలెంట్‎గా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. శుక్రవారం (జనవరి 31) జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‎లో కేసీఆర్ సమావేశమయ్యారు. ఝారసంగం నుంచి పాదయాత్రగా వచ్చిన 500 మంది బీఆర్ఎస్ శ్రేణులు.. కేతికి సంగమేశ్వర స్వామి ప్రసాదం కేసీఆర్‎కి అందజేశారు. 

ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఆయ న ప్రసగించారు. గత కొంత కాలంగా మౌనంగా ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో మనదే అధికారమని కార్యకర్తల్లో ధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎంఎల్ఏ మాణిక్ రావు, జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కేసీఆర్ స్పీచ్ హైలెట్ పాయింట్స్:


నేను కొడితే మాములుగా ఉండదు.. మాజీ సీఎం కేసీఆర్
చాలా చాలా రోజుల తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలతో తన ఫాంహౌస్ లో మీట్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారాయన. 
>>> నేను మౌనంగా ఉన్నానని అంటున్నారు.. కానీ గంభీరంగా చూస్తున్నాను..
>>> కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్ నాయకులు జనం మధ్య తిరిగితే వాళ్లు కొట్టేట్టు ఉన్నారు.
>>> తులం బంగారానికి ఆశ పడి ప్రజలు ఓట్లేశారు.. 
>>> కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదు.. ఈసారి విజయం మనదే. 
>>> కాంగ్రెస్ వస్తే రైతు భరోసా.. దళిత బంధు ఉండదని ఆనాడే చెప్పాను.. నా మాట వినలేదు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు జనం.
>>> కాంగ్రెస్ వాళ్లు సోషల్ మీడియాలో పోల్ పెడితే.. మనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
>>> కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కండి.. మీ వెనక నేనున్నానంటూ భరోసా ఇచ్చారు కేసీఆర్. 
>>> ఫిబ్రవరి నెల చివరలో పార్టీ బహిరంగ సభ పెడుతున్నాను.. మీరంతా తరలిరావాలి. 
>>> తెలంగాణ వాళ్ల శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి.. వాళ్ల మెడలు వంచుతాం.
ఎర్రవల్లి ఫాంహౌస్ లో తనను కలిసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు కేసీఆర్.