వనమా ఇంట్లో కేసీఆర్..

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఇంట్లో బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీర్​ బుధవారం కొంతసేపు ఉన్నారు. ఖమ్మం లోక్​ సభ బీఆర్​ఎస్​ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన రోడ్​ షోలో కేసీఆర్​ పాల్గొన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్​ హౌస్​లో రాత్రి బస చేశారు. ఖమ్మం, మహబూబాబాద్​ లోక్​ సభకు పోటీ చేస్తున్న బీఆర్​ఎస్​ అభ్యర్థుల గెలుపు కోసం చేపట్టాల్సిన అంశాలపై ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్​ సమావేశం నిర్వహించారు.

బుధవారం సాయంత్రం సింగరేణి గెస్ట్​ హౌస్​ నుంచి మహబూబాబాద్​ వెళ్తూ పాల్వంచలో వనమా వెంకటేశ్వర రావు​ కోరిక మేరకు ఆయన ఇంట్లో కొంత సేపు ఆగారు. కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ ఉండడంతో ఆయనను బీఆర్​ఎస్​ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే సస్పెండ్​ అయి ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలను రాఘవ ముందుండి నడిపించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేసీఆర్​లోక్​సభ ఎన్నికల్లో పనిచేయాలంటూ ‘రాఘవ గో హెడ్’​ అంటూ భుజం తట్టి తనను ప్రోత్సహించారని రాఘవ తెలిపారు