
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఏప్రిల్ 10న గజ్వేల్ లోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. ఈ మధ్యనే కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. గతంలో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్..ఇపుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం డిసెంబర్ 8, 2023 కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలు జారీ పడిపోయిన సంగతి తెలిసిందే..ఈ ప్రమాదంలో తన మోకాలి తుంటి మార్పిడి ఆపరేషన్ జరిగింది. రెండు మూడు నెలల పాటు రెస్ట్ తీసుకున్నారు. మళ్లీ అడపాదడఫా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మార్చి 19న బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజున అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై తన ఫామ్ హౌస్ లో ఉమ్మడి జిల్లాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.