
- రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారం
- పదేండ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవు
- ఇప్పడు సమస్యల వలయంలో తెలంగాణ
- మోదీ నా మెడపై కత్తి పెట్టినా నేను వెనుకడుగు వేయలే
- ఈ భూమ్మీద ఎవరూ శాశ్వతం కాదు
- అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలె
- ఎర్రవల్లి ఫాం హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సింగిల్ గానే అధికారంలోకి వస్తామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గడిచిన పదేండ్లలో తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు సమస్యల వలయంలో రాష్ట్రం చిక్కుకుందని చెప్పారు. గోదావరి కన్నీటి గోస పేరుతో పాద యాత్ర చేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవల్లి ఫాంహౌస్ లో కలిశారు. ఆరు రోజుల పాటు180 కిలో మీటర్ల కోరుగంటి చందర్ ను మాజీ సీఎం కేసీఆర్ అభినందించారు.
ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని, అలాగే సిరిసంపదలు ఉన్న తెలంగాణను దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆ నాడు మోదీ తన మెడపై కత్తిపెట్టిన తెలంగాణ ప్రయోజనాల కోసం తాను వెనుకడగు వేయలేదని చెప్పారు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేశారని అన్నారు. బలవంతంగా ఆంధ్రలో కలిపారని అన్నారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడే కాదని చెప్పారు. ఈ భూమ్మీద ఎవరూ శాశ్వతం కాదని, అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలని, తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని అన్నారు.
ALSO READ | ఏపీలో కూటమి లేకపోతే జగనే గెలిచేవాడు: కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని అన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టకున్నా కల్యాణ లక్ష్మి, రైతుబంధు పథకాలను ప్రజలకు అందించిన ఘన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, పుట్ట మధు, గజ్వేల్ నియోజకవర్గ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, మాదాసు శ్రీనివాస్ తదితరులున్నారు.