ఏపీలో కూటమి లేకపోతే జగనే గెలిచేవాడు: కేసీఆర్

ఏపీలో కూటమి లేకపోతే జగనే గెలిచేవాడు: కేసీఆర్

తన ఎర్రవల్లి ఫాంహౌస్ లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. ఏపీ రాజకీయాలపై కీలకమైన కామెంట్స్ చేశారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు లేకుండా ఉండి ఉంటే.. జగనే గెలిచేవాడని.. ఆ మూడు పార్టీలు కలవటం వల్లే చంద్రబాబు గెలిచాడంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పొత్తులపై జరుగుతున్న ప్రచారం.. కార్యకర్తల డౌట్స్ కు క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పొత్తు కుంటాయి అని.. బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న రాద్దాంతంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ALSO READ | డీలిమిటేషన్పై ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ..

పొత్తులు అన్ని సమయాల్లో కలిసిరావని.. బెల్లం ఉన్న దగ్గరకే ఈగల వస్తాయంటూ వ్యాఖ్యానించారు కేసీఆర్. గత ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఏపీ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అధికారంలో ఉండి ఓడిపోయాయి. ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాయి. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ, ఏపీలో జగన్ వైసీపీ పార్టీలు సింగిల్ గానే పోటీ చేశాయి.. పొత్తు లేకుండా.. ఈ క్రమంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తిగా మారాయి.