మక్క కంకులు కాల్చిన మాజీ సీఎం చౌహాన్‌

యాదాద్రి, వెలుగు : మధప్రదేశ్​మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాల్చారు. బుధవారం వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని.. హైదరాబాద్‌కు వెళ్తుండగా, ఆయనకు ఆలేరు వద్ద రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తూ ఓ మహిళ కనిపించింది. వెంటనే తన వాహనాన్ని ఆపి.. ఆ మహిళతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం నిప్పుల్లో ఉన్న కంకులకు గాలి తగిలేలా విసన కర్రతో విసిరి, వాటిని కాల్చారు. అనంతరం మొక్కజొన్న కంకులను ఆయన టేస్ట్ చేశారు.