కొంపల్లి ఫామ్ హౌస్ లో రోశయ్య అంత్యక్రియలు పూర్తి

కొంపల్లి ఫామ్ హౌస్ లో రోశయ్య అంత్యక్రియలు పూర్తి

మేడ్చల్ జిల్లా దేవరయాంజల్ లోని  ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిసాయి. ఫాంహౌస్ లో అంత్యక్రియలు జరిపారు కుటుంబ సభ్యులు. అధికారికంగా ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించింది సర్కార్. పోలీసులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. నివాళి అర్పించారు. కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని కడసారి వీడ్కోలు పలికారు. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు ఫామ్ హౌస్ కు చేరుకుని తుది వీడ్కోలు చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు,.. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు దేవరయాంజల్ కు వచ్చారు.