చీరల పంపిణీ, ఆర్థిక సాయం అందజేత

చీరల పంపిణీ, ఆర్థిక సాయం అందజేత

కోటగిరి, వెలుగు :  పోతంగల్ మండలం కల్లూర్ గ్రామంలో అగ్నిప్రమాదంలో ఇల్లు  దగ్ధం కాగా, బాధితురాలు బీర్కూర్ భారతి కుటుంబాన్ని మంగళవారం మాజీ కోఆప్షన్​ సభ్యుడు హకీమ్​పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. క్యాన్సర్​తో బాధపడుతున్న మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామంలో అబ్దుల్ రషీద్, జల్లాపల్లి ఆబాది గ్రామానికి చెందిన రహూఫ్ లకు ఒక్కొక్కరికి రూ.5వేల సాయమందించారు. 

 అనంతరం జల్లాపల్లి ఆబాది గ్రామంలో  50 మందికి, కోటగిరి మండల కేంద్రంలోని 50 మంది ముస్లిం మహిళలకు రంజాన్ కానుకగా చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీవేద హైస్కూల్ అధినేత తేల్ల రవి, షేక్ షేరు, షేక్ ఇస్మాయిల్, రాములు తదితరులు పాల్గొన్నారు.