- షీలా దీక్షిత్ మోడల్‌నే ఢిల్లీ కోరుకుంటున్నది
- కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు మాజీ సీఎం షీలా దీక్షిత్ డెవలప్ మెంట్ మోడల్ కోరుకుంటుందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఫేస్ బుక్ లో హిందీలో ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు.
‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కాలుష్యం, అవినీతి వంటి సమస్యలు ఢిల్లీ ప్రజల ముందున్నాయి. ఇప్పుడు ఢిల్లీ షీలా దీక్షిత్ రియల్ డెవలప్ మెంట్ మోడల్ ను కోరుకుంటోంది. ప్రధాని మోదీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం, పీఆర్ మోడల్ కాదు’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.
కాగా, తమిళనాడు గడ్డపైనే ఐరన్ ఏజ్ ప్రారంభమైందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. భారత గొప్ప వారసత్వం ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. భారత వారసత్వాన్ని ప్రతి రాష్ట్రం, కమ్యూనిటీ సెలబ్రేట్ చేసుకోవాలని వెల్లడించారు.