Jagga Reddy: జగ్గా రెడ్డా మజాకానా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. పవర్ ఫుల్గా ఫస్ట్ లుక్ పోస్టర్

Jagga Reddy: జగ్గా రెడ్డా మజాకానా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. పవర్ ఫుల్గా ఫస్ట్ లుక్ పోస్టర్

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తెరంగేట్రం చేస్తున్నారు. ఈ మూవీ ‘జగ్గారెడ్డి’ టైటిల్‍తోనే రానుంది. లవ్ ఆఫ్ వార్ అనే ట్యాగ్‍లైన్ ఉంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఇవాళ మార్చి 10న విడుదలైంది. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది.

సాధారణంగా జగ్గారెడ్డి.. రూటే సపరేట్ అన్నట్టు తన ఆహార్యం ఉంటుంది. స్టేజీలపై జగ్గారెడ్డి మాట్లాడే పదునైన మాటలు, ఇంకొన్ని సార్లు అతన్ని నుండే వచ్చే సెన్సేషనల్ కామెంట్లు.. ఇలా ప్రతిదీ తన పవర్ ఫుల్ ఇజాన్ని గుర్తుచేస్తాయి. ఇపుడు ఆయన నుండి ఓ పవర్ ఫుల్ సినిమా వస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.  

ఇటీవలే మీడియాతో చిట్ చాట్ లో సినిమా రంగంలోకి ఎంట్రీ విషయాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించారు. తన ఒరిజనల్ క్యారెక్టర్కు ఈ సినిమాలోని రోల్ అద్దం పట్టనుందని, అందుకే నటిస్తానని ప్రకటించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిల అనుమతి తోనే సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు.

ఈ ఉగాదికి స్టోరీ వింటానని, వచ్చే ఉగాదికి సినిమా విడుదలవుతుందని చెప్పారు. ఒక వ్యక్తి తనను కలిసి.. తన క్యారెక్టర్కు తగ్గట్టు రోల్తో ఉందని చెప్పాడని పేర్కొన్నారు. సినిమాలో నటించాలని అడిగారన్నారు. ఇంటర్వెల్కు ముందు మొదలయ్యే తన పాత్ర చివరి వరకు ఉంటుందని తెలిపారు. ఈ సినిమాకు వద్ది రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‍ప్లే కూడా ఆయనే. ఇకపోతే.. ఓ యువ జంట ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. వారిని సంరక్షించే నాయకుడిగా జగ్గారెడ్డి నటించనున్నారని తెలుస్తోంది. 

ALSO READ | Gopichand 33: 'ఘాజీ' దర్శకుడితో గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. 7వ శతాబ్దానికి పయనం.. ప్రయోగం ఫలించేనా!

అలాగే, పొలిటీషియన్‌‌‌‌ అద్దంకి దయాకర్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో బొమ్మకు మురళి తెరకెక్కించిన  ‘ఇండియా ఫైల్స్‌‌‌‌’ చిత్రం త్వరలో విడుదలవుతోంది. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించనున్నారు. ఇందు అద్దంకి దయాకర్ సరసన.. ప్రముఖ నటి ఇంద్రజ నటిస్తుంది. పలువురు రాజకీయ నేతలు కూడా నటిస్తున్నట్టు సమాచారం.