వైరా, వెలుగు:- ఐదేండ్ల క్రితం ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ నేటికి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని,70 శాతం రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. సోమవారం వైరా ఎస్బీఐటౌన్ బ్రాంచి, యూనియన్ బ్యాంకుల ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. రైతు రుణమాఫీ ఆశ చూపి ఓట్లు లబ్ధి పొంది అధికారం లోకి వచ్చినా.. ఇప్పటికీ రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయడం లేదన్నారు.
రైతు రుణమాఫీ సంపూర్ణం గా అమలు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ అధ్యక్షులు మల్లెంపాటి రామారావు, మండల అధ్యక్షులు మేడా శరబంధి, కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు, సీపీఎం వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు కురుగుంట్ల శ్రీనివాసరావు, పైడిపల్లి సాంబశివరావు పాల్గొన్నారు.