బోధన్, వెలుగు: బోధన్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ పేర్కొన్నారు. బుధవారం బోధన్‌లోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్‌రావు, శేఖర్, సీనియర్ లీడర్లు రాంబాబు బీఆర్ఎస్లో చేరారు. వారికి షకీల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షకీల్ మాట్లాడుతూ..బోధన్ లోని శక్కర్‌నగర్‌లో త్వరలో నియోజకవర్గంలోని యువ నాయకులతో యువగర్జన సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్టౌన్ప్రెసిడెంట్రవీంద్ర యాదవ్, బీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.
Also Read ; అన్నదాతే కాదు.. ప్రాణదాత కూడా: 61 ఏళ్ల రైతు.. కిడ్నీలు, లివర్, కళ్లు దానం