ధోని ఒక్క ఛాన్స్ ఇచ్చివుంటే పరిస్థితి వేరేలా ఉండేది

ధోని ఒక్క ఛాన్స్ ఇచ్చివుంటే పరిస్థితి వేరేలా ఉండేది

భారత మాజీ కెప్టెన్ ధోనిపై మాజీ క్రికెటర్ ఈశ్వర్ పాండే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈశ్వర్ పాండే..ధోని తనకు అవకాశం ఇవ్వలేదని ఇన్ స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చాడు. 2014 ఇంగ్లండ్, న్యూజిలాండ్ పర్యటనలకు ఎంపికైన తనకు ధోని.. తుది జట్టులో అవకాశం ఇవ్వలేదన్నాడు. ఒకవేళ ఛాన్స్ ఇచ్చి ఉంటే..తన కెరీర్ మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ishwar pandey (@ishwar22)

వారితో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం హ్యాపీ..
టీమిండియా తరఫున ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లు ఆడేందుకు వెళ్లడం తనకు గర్వకారణమన్నాడు.  కానీ  తుది జట్టులో స్థానం దక్కకపోవడం బాధకలిగించిందన్నాడు.  కానీ కోహ్లీ, ధోని, యువరాజ్‌,  రైనా, ఇషాంత్‌ శర్మ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి ఈ తరం గొప్ప క్రికెటర్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం  ప్రత్యేకమన్నాడు. లెజెండ్  సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి ఆడటంతో తన కల నెరవేరిందన్నాడు. సచిన్‌ను ఆటను చూస్తూ పెరిగానని.. చిన్నప్పటి నుంచి ఆయన్నే ఆరాధించానని తెలిపాడు.  2014లో ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌కు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ  ఈశ్వర్‌ పాండే  ఎమోషనల్ ట్వీట్ చేశాడు. 

ఛాన్స్ దక్కలేదు..
2007లో క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన  పాండే.. మధ్యప్రదేశ్‌ అండర్‌ 19 టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.  మంచి ప్రదర్శన చేయడంతో...రంజీల్లో ఆడే అవకాశం వచ్చింది. 2013-14 రంజీ సీజన్‌లో ఆడిన ఈశ్వర్‌ పాండే.. టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్‌లో అవకాశం దొరికింది. ఐపీఎల్ లో  రైజింగ్‌ పుణె, చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడాడు.  నిలకడగా రాణించడంతో... టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ పర్యటనలకు అవకాశం దక్కించుకున్నాడు. కానీ తుది జట్టులో ఆడే అవకాశం ఈశ్వర్ పాండేకు దక్కలేదు.

దేశవాళీ కెరీర్..
2010లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈశ్వర్ పాండే..మొత్తం 75 మ్యాచులు ఆడాడు. 263 వికెట్లు పడగొట్టాడు. అలాగే లిస్ట్ A క్రికెట్ లో 58 మ్యాచులు ఆడిన పాండే..63 వికెట్లు దక్కించుకున్నాడు. టీ20 ఫార్మాట్ లో 71 మ్యాచుల్లో పాల్గొని..68 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ధోనీ సారథ్యంలో సీఎస్‌కే తరఫున 20కి పైగా మ్యాచ్‌లు ఆడిన పాండే... మొత్తం 25 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు.