టెస్ట్ మ్యాచ్ రిహారల్స్ మాదిరిగా CSK పవర్ ప్లే బ్యాటింగ్.. ధోనీ సేన పరువు తీసిన మాజీ క్రికెటర్

టెస్ట్ మ్యాచ్ రిహారల్స్ మాదిరిగా CSK పవర్ ప్లే బ్యాటింగ్.. ధోనీ సేన పరువు తీసిన మాజీ క్రికెటర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 5 సార్లు టైటిల్ నెగ్గి మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టుగా చెలామణి అవుతోన్న చెన్నై సూపర్ కింగ్స్‎ ఈ ఈ సీజన్‎లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ఎమ్మెస్ ధోనీ, రవీంద్ర జడేజా, అశ్విన్, రచీన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ.. చెన్నై వరుస ఓటములను చవి చూస్తోంది. ఈ సీజన్‎లో ఇప్పటికే 6 మ్యాచులు ఆడిన సేఎస్కే.. కేవలం ఒక్క గేమ్‎లో మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడుతోంది. 

ఏప్రిల్ 11న కోల్‎కతాతో జరిగిన మ్యాచులోనైతే మరీ దారుణంగా ఓడింది. కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్ల  బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వణికిపోయిన సీఎస్కే 20 ఓవర్లు ఆడి చచ్చీచెడి103 రన్స్ కొట్టింది. ఫలితంగా సొంత గ్రౌండ్ చెపాక్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో తమ లోయెస్ట్‌‌‌‌‌‌‌‌ స్కోరు నమోదు చేసిన ధోనీసేన 8 వికెట్ల తేడాతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం చెన్నైపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చెన్నై ఆట తీరు చూసి సగటు సీఎస్కే అభిమాని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడంటే.. ధోనీ సేన ఆట తీరు ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఈ క్రమంలోనే కోల్‎కతాపై ఓటమి అనంతరం చెన్నైపై భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ (ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. సీఎస్కేకు ఇప్పటి వరకు ఎదురైన పరాజయాలలో ఇది దారుణమైనది. పవర్‌ప్లేలో చెన్నై బ్యాటింగ్ ఒక టెస్ట్ మ్యాచ్ రిహార్సల్ లాగా ఉందని ధోనీ సేన పరువు తీశారు. 

ALSO READ : ఒక్క దెబ్బకు రెండు రికార్డులు బ్రేక్: అశ్విన్, రషీద్ ఖాన్‎ల రికార్డులు బద్దలుకొట్టిన నరైన్

చెన్నై ప్లేయింగ్ లెవన్ మొత్తం అయోమయంలో ఉందన్నారు. చెన్నై ఇక పరిధి దాటి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఫామ్‎లో లేని ఆటగాళ్లను పక్కకు పెట్టాలని సూచించారు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న వారిని తొలగించి.. ఐపీఎల్ వేలంలో అమ్ముడిపోని పృథ్వీ షా వంటి టాలెంట్ బ్యాటర్‎ను సీఎస్కే ఎందుకు తీసుకోకూడదని సలహా ఇచ్చాడు. మీరు ఈ వ్యూహాన్ని ట్రై చేస్తారా అని ప్రశ్నించారు.