Champions Trophy 2025: ప్రిడిక్షన్ చూస్తే నవ్వుకోవాల్సిందే.. పరువు పోగొట్టుకున్న దిగ్గజ క్రికెటర్లు

Champions Trophy 2025: ప్రిడిక్షన్ చూస్తే నవ్వుకోవాల్సిందే.. పరువు పోగొట్టుకున్న దిగ్గజ క్రికెటర్లు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో నేడు (ఫిబ్రవరి 19) పాకిస్థాన్,న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీకి ముందు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో సెమీ ఫైనల్ కు వెళ్లే జట్లపై మాజీ క్రికెటర్లు తమ ప్రిడిక్షన్ ఇచ్చారు. ఈ ప్రిడిక్షన్ లో భాగంగా కొంతమంది మాజీ క్రికెటర్లు అర్ధం లేని జోస్యాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. వీరిలో ముగ్గురు భారత మాజీ క్రికెటర్లు ఉండడం విశేషం. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తో పాటు సురేష్ రైనా,హర్భజన్ సింగ్, రవి శాస్త్రి సెమీ ఫైనల్ కు ఏయే జట్లు వెళ్తాయో చెప్పుకొచ్చారు.

షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్ గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో బరిలో నిలవగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో పోటీ పడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్– 2లో నిలిచే జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే మాజీ క్రికెటర్లు మాత్రం తమ ప్రిడిక్షన్ తో షాక్ ఇచ్చారు. మైకేల్ క్లార్క్ ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్,ఆస్ట్రేలియా సెమీ  ఫైనల్ కు వెళ్తాయని చెప్పాడు. అయితే ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్ ఒకే గ్రూప్ లో ఉండడం విశేషం. మూడు జట్లు ఒకే గ్రూప్ నుంచి సెమీస్ కు వెళ్లే అవకాశం లేదు. 

Also Read :- వెనక్కి తగ్గిన పాక్

ఇక రవి శాస్త్రి గ్రూప్ బి లో మూడు జట్లు సెమీస్ వెళ్తాయని చెప్పాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తో పాటు టీమిండియా సెమీస్ కు వెళ్తాయని తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ గ్రూప్ బి లో ఉన్నాయి. రైనా గ్రూప్ బి లో  ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అని తెలిపాడు. అతని చెప్పిన ప్రిడిక్షన్ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా,ఆఫ్ఘనిస్తాన్ కె గ్రూప్ లో ఉన్నాయి. హర్భజన్ సింగ్ సైతం క్లార్క్ చెప్పినట్టుగా ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్,ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు వెళ్తాయని జోస్యం చెప్పాడు. వీరిపై నెటిజన్స్ సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.