
- డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు : మతసామరస్యానికి ఇఫ్తార్ విందు ప్రతిక అని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుణగంటి బాబూరావుగౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఉపసర్పంచ్ వాకిటి అమృత కృష్ణ ఇచ్చిన విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ పండుగ ఏదైనా కుల, మతాలతో సంబంధం లేకుండా అందరూ ఆస్వాదించడం తెలంగాణ ప్రజల ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఇలాంటి విందులతో ప్రజల మధ్య మతసామరస్యం వెల్లివిరుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, పాల సంఘం చైర్మన్ మారెడ్డి కొండల్ రెడ్డి, మండల కో–ఆప్షన్ మాజీ సభ్యుడు ఎండీ యాకూబ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గొట్టిపర్తి బాలరాజు గౌడ్, నాయకులు పాల్గొన్నారు.